సర్ సి.వి. రామన్.
1928లో నోబెల్ బహుమతి పొందిన మహోన్నత వ్యక్తి. 'రామన్ ఎఫెక్టు' అనే ఆవిష్కరణకు ఈ బహుమతి వచ్చింది.
తమిళనాడు లో జన్మించిన రామన్ కలకత్తాలో పరిశోధన చేశాడు. సంగీతం మీద కూడా ఎంతో ఆసక్తి. వీణ, మృదంగం పై పరిశోధన చేశారు. కలకత్తా నుంచి బెంగుళూరు తరలివచ్చారు. బెంగుళూరులో విజ్ఞాన సంస్థలు ఏర్పరచారు. రామన్ శిష్యులు ఎందరో గొప్పశాస్త్రవేత్తలు అయ్యారు.
నోబెల్ బహుమతి రాకపోయినా విశేష పరిశోధన చేసిన వారు - జగదీశ్ చంద్రబోస్.
రేడియో టెలిగ్రఫి మీద ఎంతో పరిశోధన చేశారు. మొక్కలుు కూడా ప్రాణం గలవని ప్రతిపాదించారు. ఈ జీవశాస్త్ర పరిశోధనలు చాలా ప్రసిద్ధం. జగదీశ్ చంద్రబోస్ మంచి భావుకులు, కవి, రచయిత.
గణితశాస్త్రపు అద్భుతం - శ్రీనివాసరామానుజం.
అతిచిన్న వయసులో మరణించినా అమోఘ ప్రతిభ గలవారు. కేంబ్రిడ్జి ఆచార్యుడు హార్డి ప్రోద్భలంతో విదేశాలు వెళ్ళారు. అనంతమైన గుర్తింపు పొందారు. అయితే ఆరోగ్యం దెబ్బతినడంతో భారతదేశం వచ్చేసారు. అతి చిన్న వయసులో మరణించారు అయినా అతని పేరు శాశ్వితం.
తెలుగు వారు గర్వించదగ్గ శాస్త్రవేత్త యాల్లాప్రగడ సుబ్బారావు.
ప్రపంచం కొనియాడాదగ్గ వ్యక్తి. 'ట్రాసైక్లిన్' కనుగొని ప్రపంచానికి ఆయువుపోశారు. బాల్యంలో పలురకాలుగా కష్టాలు పడ్డారు. అన్న అనారోగ్యం తో మరణించడం అతనిని క్రుంగదీసింది. అందుకే వైద్యం మీద ఆసక్తి కల్గింది. విదేశాలలో అత్యుత్తమ పరిశోధన చేశారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
గోప్ప ఇంజనీరు. ఒక్క ఇంజనీరే కాదు ఒక విద్యావేత్త ఒక దేశభక్తుడు. బాల్యంలో కష్టాలను భరించి జీవితంలో పైకి వచ్చారు. అతని క్రమశిక్షణ చాలా గొప్పది. 102 సంవత్సరాలు జీవించారు. విద్యారంగం, ప్రణాళికారంగం, వ్యవసాయం, పరిశ్రమల సర్వతో ముఖాభివృద్ధిని ఆశించినవారు విశ్వేశ్వరయ్య.
ఎటువంటి డిగ్రీలు లేకుండా గోప్ప పేరు గడించిన శాస్త్రవేత్త సలీంఅలీ.
శాస్త్రవేత్త దృష్టి నిశితమైంది. సరిగాతెలియని ఒక రకం పక్షులును చూశారు. నాలుగు నెలలు దీక్షగా పరిశీలించారు. ఆవివరాలతో పరిశోధనా పత్రం రాశారు. అంతర్జాతీయ కీర్తి వచ్చింది. భారతీయ పక్షుల మీద పరిశోధన కొనసాగించారు.
భారతదేశంలో అణుశాస్త్ర విజ్ఞానం అనగానే హోమ జహంగీర్ భాభా పేరు గుర్తుకు వస్తుంది.
ముంబైలో బార్క్ సంస్థ బాబా స్థాపించినదే! అంతే కాదు సైద్ధాంతిక పరిశోధనకు టి.ఐ.ఎఫ్.ఆర్. వచ్చేలా కృషి చేశారు.
మనదేశం అంతరిక్ష విజ్ఞానంలో ఎంతో పేరు గడించింది. దానికి కారణం డాక్టరు విక్రం సారాభాయ్.
అతని కృషి ఫలితమే అటమిక ఎనర్జీ కమీషన్. విశ్వకిరణాలకు ప్రయోగశాల రూపొందించారు. సారాభాయి పునాదుల ఫలితమే మన అంతరిక్ష విజయాలు.
పి.సి.రే రసాయనశాస్త్రంలో దిట్ట.
గోప్ప ఉపాధ్యాయుడు. ఎముకల నుంచి గంధకీకామ్లం తయారు చేశారు. బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్ స్థాపించారు. ఇలా ఎంతో మంది మనదేశం కోసం కృషి చేశారు. మనకు ఎన్నో సౌఖ్యాలు కల్పించారు.
- సత్యనారాయణ మూర్తి నేపా
Digital Yuvatha









��������what A ఫెంటాస్టిక్ ఆర్టికల్..... awesome.....
రిప్లయితొలగించండి